అర్ధరాత్రి వీడియో కాల్.. తెల్లవారేసరికి విషాదం!
శేరిలింగంపల్లి,అక్టోబర్ 25(విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన అర్చన చౌదరి మాలిక్ అనే యువతి నగరంలోని చంద్రనాయక్ తండాలో ఉన్న ఎస్‌ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసముంటోంది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన భండారి విమల్‌తో గత నాలుగేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ సంబంధం నేపథ్యంలో విమల్ తన భార్యతో విడాకుల ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో చెర్యాల(Cherial)లో తన తల్లితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన విమల్‌కు అర్చన వీడియో కాల్ చేసింది. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీ కట్టి చూపిస్తూ తనను వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన విమల్ తెల్లవారుజామున 5.30 గంటలకు ఆమె ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు.
డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుతో పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బలవంతంగా తెరిచి చూడగా అర్చన ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.