‘అనకాపల్లి’ వచ్చేదిఅప్పుడే

16-09-2026 | 05:30am

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అనకాపల్లి(Anakapalli). భవ్యశ్రీ మూవీ మేకర్స్(Bhavyasree Movie Makers), నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన ఈ సినిమాకు ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్టును క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.


మరిన్ని వార్తలు