నవంబర్‌లో హై
అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో కలిసి పనిచేసి, పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు కో-రైటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఎస్ కృష్ణ(S Krishna)‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడంతో పాటు కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతోంది.
ఇందులో అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని వెల్లడిస్తూ, విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్లు నాయక్, సునీల్ రెడ్డి; సంగీతం: వికాస్ బడిసా; యాక్షన్: వీ వెంకట్; ఎడిటర్: జీఆర్కే శరణ్ రావుల; ఆర్ట్: బ్రహ్మనాథ్ ఏ పాటిల్.