డోరతి రికార్డు!
కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Director Karthik Subbaraj)తెరకెక్కించిన తాజాచిత్రం ‘డోరతీ’(Dorothy). జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కెరీర్‌లో సంగీత సారథ్యం వహించిన 1540వ సినిమా ఇదే కావడం విశేషం. సెప్టెంబర్ 25న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ మూవీ విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.
కెనడాలోని ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్)లోని సెంటర్‌పీస్ విభాగంలో ఈ మూవీకి సంబంధించి వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. గత దశాబ్ద కాలంలో ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి తమిళ సినిమాగా ‘డోరతీ’ చరిత్ర సృష్టించింది.
స్కానిబాంక్ థియేటర్‌లో జరిగిన ఈ ప్రీమియర్ షోకు ప్రధాన తారాగణమైన కీర్తి సురేశ్, సనత్, రిషికాంత్‌తోపాటు చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నిర్మాతలు గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టీఐఎఫ్‌ఎఫ్ అంతర్జాతీయ వేదికపై ఈ సినిమాకు సముచిత గౌరవం దక్కటం గొప్ప విషయం.