తైక్వాండోలో పతకాల పంట

28-09-2026 | 03:46pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : కె ఎల్ బి(KLB) కప్ 3వ ఓపెన్ తైక్వాండో అండ్ కరాటే ఛాంపియన్ షిప్ ఇండియా(Ship India) 2026 లో ఘట్ కేసర్ పట్టణంలోని రిషి స్కూల్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలను సాధించారు.     తైక్వాండో మొదటి పూమ్సే, రెండవ పూమ్సే లో గెలిచిన రిషి స్కూల్ ఘట్కేసర్ విద్యార్థులు జి. రితేష్ బాబు (బంగారు పతకం 7వతరగతి),  బి. వరుణ్ తేజ్ (బంగారు పతకం 4వ తరగతి), బి. చెర్విక్ (వెండి పతకం 7వ తరగతి), రితేష్ దాస్ గుప్త (వెండి పతకం 4వ తరగతి) సాధించారు.

ఇవి కూడా చదవండి: చిన్నారులను పంపండి

కె.ఎల్.బి కప్ నిర్వాహకులు కె.పి హనుమంతు 6వ డాన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ కోచ్ విద్యార్థుల ప్రదర్శన చూసి చదువుతో పాటు క్రీడలల్లో కూడా ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లి తండ్రులని, రిషి స్కూల్ యాజమాన్యం డైరెక్టర్లు ఎస్. పద్మా రెడ్డి, ఎస్. రవీందర్ రెడ్డి, కె. బాబుల్ రెడ్డి, డి. శంకర్ గౌడ్, జి.అభినందన్ రెడ్డి, ప్రిన్సీపాల్ పి. స్వప్న రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్  లకు కృతజ్ఞతలు తెలుపుతూ శిక్షణ ఇస్తున్న గ్యార నరేష్ బ్లాక్ బెల్ట్ 1వ డాన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ తైక్వాండో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోచ్ ని అభినందించారు.

మరిన్ని వార్తలు