శివ్వంపేట బగలాముఖీ శక్తిపీఠంలో ఆధ్యాత్మిక వైభవం
200 జంటలతో మహాయజ్ఞం!
శివ్వంపేట అక్టోబర్ 25 ( విజయక్రాంతి ) : మెదక్ జిల్లా(Medak District) శివ్వంపేటలోని శ్రీ బగలాముఖీ శక్తిపీఠం భక్తులతో(devotees) కిటకిటలాడింది. లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి మహామంత్రానుష్ఠాన మహాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో(devotional) వైభవంగా నిర్వహించారు.
శక్తిపీఠం ప్రాంగణంలో 200 జంటలతో మహాయజ్ఞం నిర్వహించడంతో పాటు అమ్మవారికి పసుపుతో హరిద్రార్చన, రుద్రయామల, శ్రీసూక్తం, దేవీసూక్తం, బగలాముఖీ అష్టోత్తర నామార్చన, ప్రత్యేక పూజలు(Special prayers), అభిషేకం, మంత్రపుష్పం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి రుత్వికులు, పీఎంజీ యువసేన సభ్యులు సంపూర్ణ సహకారం అందించారు.
ఈ మహాయజ్ఞంలో శక్తిపీఠం స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త–స్వరూప దంపతులు, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, మాజీ ఎంపీపీ హరికృష్ణ, శక్తిపీఠం ట్రస్టు సభ్యుడు జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, అడ్మినిస్ట్రేటర్ సూర్యం కుమార్ గౌడ్, రాజీపేట సర్పంచ్ వెంకటేశ్వర్, ఉపసర్పంచ్ మల్లేష్తో పాటు పలువురు సర్పంచులు, భక్తులు(devotees) పాల్గొన్నారు.