రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

28-10-2026 | 04:12pm

ముకరంపుర, అక్టోబర్ 28(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Municipal Corporation) పరిధిలోని 43, 60వ డివిజన్లలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా 60వ డివిజన్ కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో కార్పొరేటర్ నస్రీమ్ సుల్తాన- ఇబ్రహీం తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను అలాగే 43వ డివిజన్ గోదాంగడ్డ ఏరియాలో కార్పొరేటర్ పొన్నం లక్ష్మీ- మొండయ్య గౌడ్ తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ. 14 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అతీన, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు