బహుళ పంటలతో అధిక ఆదాయం

30-09-2026 | 02:04pm

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేవికే కేంద్రంలో జిల్లా స్థాయి కిసాన్ మేళా(Farmers' Fair) అట్టహాసంగా జరిగింది. ఆత్మ ఆధ్వర్యంలో చేపట్టిన కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు(Harish Rao) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కిసాన్ మేళాను ప్రారంభించారు. అంతకుముందు కిసాన్ మేళా స్టాళ్లను సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్  కుమార్ దీపక్ మాట్లాడారు.రైతులు ఒకే పంటపై ఆధారపడొద్దని తెలిపారు.బహుళ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ఇలాంటి సాగు వల్ల రైతులకు ఆదాయం అధికంగా  పెరుగుతుందన్నారు. బెల్లంపల్లి కేవికే కేంద్రంలో నైపుణ్యం ఉన్న శాస్త్ర వేత్తలు ఉన్నారని తెలిపారు. 

రైతులు  వెనుకబడిపోవడానికి  సాగునీటి సౌకర్యం లేకపోవడమని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వ్యవసాయకంగా మా ప్రాంతం వెనుకబడి ఉన్నదని వాపోయారు. రైతులు కూడా  ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలని కోరారు. ఈ దిశగా వ్యవసాయ నిపుణులు ఎడ్యుకేట్ చేయాలని కోరారు. తుమ్మిడి హిట్ ప్రాజెక్టు నిర్మాణం  అయితే రైతుల భాదలన్ని పోతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదలైతే జిల్లాలో లక్షలాదీ ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ రైతులకు కలెక్టర్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వీరహత్ అలీ, జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, కేవికే ఇంచార్జీ కోఆర్డినేటర్ మహేష్, ఏ ఎంసీ చైర్మన్ భానేష్, జిల్లాలోని లోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, జన్నారం తదితర ప్రాంతాల్లో నుంచి వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు