వి బి జి రామ్ పనుల పైన చర్చించి నిర్ణయాలు తీసుకోండి

30-09-2026 | 03:25pm

ఎంపీడీవో.

బోథ్. సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి) గ్రామాలలోని సర్పంచులు వి బి జి రామ్ పథకంలో(VBG Ram Scheme) పనులు చేపట్టేందుకు గాను అక్టోబర్ 2న గ్రామసభను నిర్వహించి అవసరమైన పనులను చేపట్టడానికి తీర్మానం చేయాలని ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలో అన్ని మండలాల సర్పంచులు గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైన పనులను గుర్తించి పూర్తి చేసేందుకు తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రభుత్వం నిర్దేశించిన పనులను చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు