పొనకల్ లో గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 | 12:41pm
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలుGandhi Jayanti Celebrations) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీపీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ మాట్లాడుతూ... మహాత్మా గాంధీ(Mahatma Gandhi) ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి (ఈవో) రాహుల్, ఉప సర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.