కలెక్టరేట్లో ఐక్యతా ప్రతిజ్ఞ
నస్పూర్ (విజయక్రాంతి): దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవం (National Unity Day) అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు (Additional Collectors) (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ (National Unity Pledge) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ దేశ సమగ్రతను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.