ప్రభుత్వ వైద్య సేవలకు మరోసారి కాయకల్ప అవార్డు

17-10-2026 | 05:35pm
  1. స్టేట్ సెకండ్ కాయకల్ప అవార్డు..
  2. సూపరింటెండెంట్ రవి కి ప్రశంసలు 
  3. మెరుగైనా సేవలకు గుర్తింపు 
  4. రూ. 10లక్షల నగదు గిఫ్ట్ 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రికి మరోసారి ఉత్తమ వార్డు(Best Ward) లభించింది. స్టేట్ సెకండ్ స్థానం సొంతం చేసుకుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి(Bellampalli Government Hospital) తన వైద్య సేవలను(medical services) మరోసారి చాటుకుంది. రెండోవ స్థానం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డు కి ఎంపికైంది. మళ్ళీ అవార్డు సాధించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ  సేవలను రాష్ట్ర స్థాయిలో మరోసారి  చాటుకున్నది.

బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు సూరింటెడెంట్ గా బాధ్యతలు చేపట్టిన జి.రవి తొలినాళ్లలోనే  బెల్లంపల్లి ఆస్పత్రి దశ మారింది. ఆయన పర్యవేక్షణలో  ఈ ఆస్పత్రిలో వైద్య సేవల తీరులో గుణాత్మక మార్పు వచ్చింది. మెరుగైనా వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరు, వారిలో నెలకొన్న సేవాభావం రోగుల పట్ల ప్రేమమానురాగం, పరిశుభ్రత లో ఎనలేని పురోగతి సాధించారు. ఫలితంగానే 2024-25 సంవత్సరానికి గాను తొలి సారి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం లో నిలిచింది.

రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డు ను సొంతం చేసుకునే రికార్డు బద్దలు కొట్టింది. అదే స్ఫూర్తితో ఆస్పత్రిలో ఇప్పటికీ వైద్య సేవలు అందించ టంలో తన ముద్రను అలాగే నిలబెట్టుకుంది. ఆస్పత్రి తన సేవానిరతిని యధాతథంగా కొనసాగిస్తూ మరోసారి కాయకల్ప అవార్డు ను దక్కించుకుంది. 2025 - 26 సంవత్సరానికి గాను మళ్లీ కాయకల్ప అవార్డు ఎంపిక ను నిర్వహించారు. ఈ సారి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రెండోవ స్థానం లభించింది.  94.46 శాతం మార్కులు సాధించి రెండో స్థానంలో కాయకల్ప అవార్డుకి ఎంపికైంది.

ద్వితీయ స్థానం లో నిలిచి రూ. 10లక్ష నగదు బహుమతిని కైవసం చేసుకుంది. మరోసారి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల నాణ్యత, సేవా నిరతిని చాటుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి పర్యవేక్షణ, దక్షత, వైద్యులు, వైద్య సిబ్బంది  ఉమ్మడి ఘనతగా ఆద్యంతం ప్రశంసిస్తున్నారు.

మరోసారి కాయకల్ప స్టేట్ సెకండ్ అవార్డు కీ ఎంపిక కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర స్థాయి లో మరోసారి తన సత్తాను చాటుకుంది. ఈ నేపథ్యంలో కాయకల్ప అవార్డు కు ఎంపికైనా సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండ్ జి రవి ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ ప్రశంసించారు. శాలువతోకప్పి సన్మానం చేశారు. స్టేట్ సెకండ్ స్థానం లభించడంతో అభినందించారు.

మరిన్ని వార్తలు