మట్టి గణపతులకే జై కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

13-09-2026 | 04:01pm

మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్

కూసుమంచి సెప్టెంబర్ 13 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణను ప్రధాన ద్యేయంగా భావిస్తూ కూసుమంచి మండల ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్, ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని  కూసుమంచి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు  పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల ఉచిత కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం  వారు ఘనంగా చేపట్టారు.  ప్రజలు,భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా మట్టి ప్రతిమలను స్వీకరించారు.

ఈ సందర్భంగా 400మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేముల శ్రీనివాస్,  కూసుమంచి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వేముల శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు పూర్ణచందర్రావు, కార్యదర్శి ఓలేటి కోటేశ్వరరావు, కోశాధికారి దేవరశెట్టి నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన ఉపాధ్యక్షులు కొత్తూరు కిషోర్,జోన్ చైర్మన్ నెకిరికంటి జనార్దన్, కార్యదర్శి కొంకిమళ్ళ రాజశేఖర్, కోశాధికారి గుడిపాటి రాంమూర్తి, అర్వపల్లి రామకృష్ణ,గరిణె. నాగేశ్వరరావు, మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు