గ్రాడ్యుయేట్స్‌.. ఓటరుగా నమోదు చేసుకోండి!

12-10-2026 | 10:41am

మహమ్మదాబాద్: గండీడ్. ఉమ్మడి మండల పరిధిలోని గ్రాడ్యుయేట్స్‌ అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని. మాజీ జెడ్పిటిసి(Former ZPTC Member) ఎం శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి 100 ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించినట్లు తెలిపారు. 

గతంలో ఉమ్మడి గండీడు మండల పరిధిలో దాదాపు 1,900 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు(Graduate voters)గా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో నమోదు చేసుకున్న వారితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ మరోసారి తమ ఓటు నమోదు ప్రక్రియను పరిశీలించుకోవాలని సూచించారు. 2023 అక్టోబర్‌ నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా పార్టీ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు