రూపాయి పరుగులు

12-10-2026 | 10:33am

డాలర్ దూకుడుకు బ్రేక్.. రూపాయి భారీ జంప్!

ముంబై: భారత కరెన్సీ మార్కెట్‌లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి(Rupee vs US Dollar) అనూహ్యంగా పుంజుకుంది. సోమవారం (అక్టోబర్ 12) ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 91 పైసలు పెరిగి రూ.95.80కు చేరింది. ఇటీవల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న Indian Rupeeకు ఈ పరిణామం కొంత ఊరటనిచ్చింది. Currency Marketలో పెరుగుతున్న ఒడిదుడుకులను నియంత్రించేందుకు Reserve Bank of India (RBI) రంగంలోకి దిగడం ఈ మార్పునకు ప్రధాన కారణంగా నిలిచింది.

రూపాయి పతనాన్ని కట్టడి చేయడంతో పాటు Foreign Exchange Marketలో డాలర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తగ్గించేందుకు RBI పలు కీలక చర్యలు ప్రకటించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు నిర్దేశిత బ్యాంకుల ద్వారా ప్రత్యేక Dollar Window ఏర్పాటు చేయడం, కొన్ని Foreign Exchange Hedging Transactionsపై ఖర్చులను పెంచడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. స్పాట్ మార్కెట్‌లో డాలర్ల డిమాండ్‌ను తగ్గించి, ఊహాజనిత ట్రేడింగ్‌ను నియంత్రించడం వీటి ప్రధాన లక్ష్యం. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న Crude Oil Prices, బలమైన US Dollar కారణంగా రూపాయిపై ఒత్తిడి ఇంకా కొనసాగవచ్చని Forex Analysts అంచనా వేస్తున్నారు. RBI చర్యలు ఎంతవరకు ఫలిస్తాయి? రూపాయి ఈ స్థాయిలో నిలదొక్కుకుంటుందా? అనేది రాబోయే ట్రేడింగ్ సెషన్లలో కీలకం కానుంది.

మరిన్ని వార్తలు