ఆపదలో అండగా హరీశన్న!
12-10-2026 | 11:09am
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): నారాయణరావుపేటకు చెందిన ఆవునూరి రామస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సర్పంచ్ బొంగరం ఎల్లారెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బింగి నవీన్, వార్డు సభ్యులు బాగన్న, బుగ్గరాజు, నవీన్, పూర్ర ఎల్లయ్య, తునికి నాగరాజుతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.