రెడ్‌క్రాస్ కార్యవర్గానికి గంగుల అభినందనలు!
ముకరంపుర, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఇటీవల నిర్వహించిన రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన వారిని గంగుల కమలాకర్ శాలువాలు కప్పి, పూల మొక్కలు అందించి సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాజిక సేవా కార్యక్రమాల (Social Service Activities) ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్ ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు కుందారపు మహేశ్వర్, కోశాధికారి గోలి శ్రీనివాస్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, పెద్ది విద్యాసాగర్, ఎలగందుల మునీందర్, సాయినేని నరేందర్, కనపర్తి మనోహర్‌రావు, మొగులోలు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.