ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలం కసరత్తు!

12-10-2026 | 08:48am

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ (BJP)లో నేడు కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, నేతల పాత్ర వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సన్నద్ధత, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం (Coordination) వంటి అంశాలపై కూడా నేతలు దృష్టి సారించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు