రహదారి పనులు ప్రారంభం

05-10-2026 | 05:20am

రామారెడ్డి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగు వంతెనకు(Gangamma Vagu bridge) అనుసంధానంగా ఉన్న రహదారి దుస్థితిపై విజయక్రాంతి దినపత్రికలో ‘వంతెన సిద్ధం.. రహదారి అధ్వానం..!’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కథనం ద్వారా సమస్య వెలుగులోకి రావడంతో రహదారి మరమ్మతు పను లు ప్రారంభమయ్యాయి. మొరం, కంకరతో రహదారి పనులు చేపట్టారు.

వంతెన నిర్మా ణం పూర్తయినా, అనుసంధాన రహదారి అ ధ్వానంగా ఉండటంతో వాహనదారులు, ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని విజయక్రాంతి తన క థనంలో ప్రస్తావించింది. వర్షాలకు రహదారిపై బురద, గుంతలు ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతున్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో రహదారి మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసు కొచ్చిన విజయక్రాంతి కథనానికి స్పందనగా పనులు ప్రారంభం కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాత్కాలిక మరమ్మతులకే పరిమితం కాకుండా రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు