ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్

05-10-2026 | 05:00am

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటే ల్‌లో రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్(Pride of Telangana Awards ) 7వ ఎడిషన్ ఘనంగా జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. క ళలు, విద్య, ఎంటర్టైన్మెంట్, హెల్త్‌కేర్, స్పో ర్ట్స్ సహా 17 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్య క్తులు, సంస్థలను అవార్డులతో సత్కరించా రు.

రౌండ్ టేబుల్ ఇండియా 148 చైర్మన్ క వల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డుల ద్వారా సమకూరే నిధులను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. స్కూళ్లల్లో భవనాలు, తరగ తి గదులు, విద్యా సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్’ కార్యక్రమం ద్వారా గ్రామీ ణ, వెనుకబడిన ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు రౌండ్ టేబుల్ ఇండియా చేస్తున్న కృ షిని అభినందించారు. సైనా నెహ్వాల్ మాట్లాడుతూ..

డాక్టర్ అవుతానని అమ్మతో ఎన్నో సార్లు గొడవపడేదాన్నని.. చివరికి అమ్మే గెలిచిందనుకుంటానని సరదాగా వ్యాఖ్యానించా రు. 25 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్ర యాణంలో ఎన్నో కలలను సాకారం చేసుకున్నానన్నా రు. తెలంగాణ తనను సైనా నె హ్వాల్‌గా తీర్చిదిద్దిందని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నా రు. తనకు అవార్డు అందించిన నిర్వాహకులకు సైనా నెహ్వాల్ కృతజ్ఞత లు తెలిపారు.

మరిన్ని వార్తలు