గుస్సాడి సంబరాలకు వేళాయె
03-11-2026 | 01:58pm
బోథ్, నవంబర్ 3 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని పర్ది(బి) గ్రామంలో ఆదివాసీలు భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాల (Gussadi Dance) కోసం ఉపయోగించే నెమలి ఈకల టోపీలు, ఇతర సామగ్రికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం సంప్రదాయబద్ధంగా నైవేద్యాలు (Offerings) సమర్పించారు. ఆదివాసీ సంస్కృతి (Tribal Culture), సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా నేటి నుంచి గుస్సాడి సంబరాలు (Festivities) ప్రారంభం కానున్నాయి.