మహిళ మిస్సింగ్.. కేసు నమోదు
03-11-2026 | 01:49pm
దమ్మపేట, నవంబర్ 03 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన కుప్పాల రామాంజలి అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి తన కూతురు కనిపించడం లేదని దమ్మపేట గ్రామానికి చెందిన పందెటి వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు (Case) నమోదు చేసినట్లు దమ్మపేట ఎస్ఐ (SI) బి. రాజేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు (Investigation) కొనసాగుతోందని వివరించారు