ఎమ్మెల్సీ మధును భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
08-09-2026 | 11:25pm
బెల్లంపల్లి, (విజయక్రాంతి): శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేల్సి తాతా మధును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. కంటా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిరసన తెలిపారు. తాతా మధు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ గూండాయిజాన్ని సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీహెచ్ శంకర్, దుబాసి వెంకటస్వామి, ప్రభాకర్, ఎల్తూరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.