రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

27-10-2026 | 12:00pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ(Rajampet Gram Panchayat) అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాటు, అవసరమైన సిబ్బందిని కేటాయించాలని రాజంపేట సర్పంచ్ బుర్సా పోచయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం ఆసిఫాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్(Telangana Panchayat Raj Commissioner Divya Devarajan)ను కలిసి గ్రామంలోని సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు.

గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌ను నియమించాలని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు