ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బార్ల వార్!
కాగజ్నగర్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్(Kagaznagar) పట్టణంలోని ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ కార్యాలయం(Excise and Prohibition Office) ఎదుట పట్టణంలోని వైన్ బార్ల నిర్వాహకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. వైన్ షాపులు, బెల్ట్ షాపుల్లో నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు మామూళ్ళు తీసుకుంటూ వారికి సహకరిస్తున్నారని అన్నారు.
అదే అన్ని ప్రభుత్వ నియమాలు పాటిస్తూ , నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించని బార్ షాపులపై నిబంధనలు కఠిన తరం చేస్తూ, అదనపు టాక్స్లు, పర్మిట్ల పేరిట లేనిపోని నిబంధనలు అమలు చేస్తూ తమను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ సీఐ మేఘమాలకు వినతి పత్రం అందజేశారు.