తెరిచి ఉన్న లగేజ్‌ డోర్‌.. ఓ ప్రాణం బలి!

27-10-2026 | 01:36pm

పాల్వంచ, అక్టోబర్ 27, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని నవభారత్ సెంటర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో సింగరేణి ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. ప్రవేట్ ట్రావెల్స్ బస్సు సిబ్బంది నిర్లక్ష్యమే  ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

 నవభారత్ కు చెందిన సతీష్ రెడ్డి(40) సింగరేణి ఉద్యోగి. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో టీ తాగేందుకు నవభారత్ సెంటర్కు వచ్చి, టీ తాగి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనాన్ని ఎక్కే సమయంలో హైదరాబాదు నుంచి భద్రాచలం వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) లగేజ్ డోర్ తెరిచి ఉండటంతో ద్విచక్ర వాహనంపై ఉన్న సతీష్ రెడ్డి బలంగా ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ళ ఎదుటే జరిగిన ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. విషయం తెలుసుకున్న పాల్వంచ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు