పట్టభద్రులారా.. ఓటు నమోదు చేసుకోండి!
తల్లాడ. సత్తుపల్లి. అక్టోబర్ 27. ( విజయ క్రాంతి): తల్లాడ మండలం(Tallada Mandal)లో పలు ఓటర్ నమోదు కేంద్రాలను సందర్శించిన తల్లాడ మండలం ఇంచార్జి మూడు ముంతల గంగరాజు తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మిరెడ్డి ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు జోసెఫ్.
ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి గెలుపే ధ్యేయంగా ఓట్లు వేసేందుకు పట్టబద్ధులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తల్లాడ మండలం ఇన్చార్జి మూడు ముంతల గంగరాజు తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, తల్లాడ మండలం ఉపాధ్యక్షుడు తాళ్ల జోసెఫ్(Talla Joseph) పిలుపునిచ్చారు.
సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాఘమయి దయానంద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆదేశాలతో మంగళవారం తల్లాడ మండలంలోని ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా.తెలగవరం తెల్లగ వరం గ్రామపంచాయతీ లో ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీలైనంత త్వరగా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు గడువు సమీపిస్తున్నందున పట్టభద్రుల ఓట్లు ఇంకా త్వరగా నమోదు చేసే విధంగా కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్యా కాలోజీ సిలివేరు నరసింహారావు ఉపసర్పంచ్, తెలగవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారెల్లి మస్తాన్ ,అనంత రాములు ,తూము వెంకటేశ్వర్లు గొల్లమందల నరేష్ పట్టభద్రులు పాల్గొన్నారు
మల్లవరం ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కేంద్రంగా పరిధిలో ఉన్న గ్రామ ముఖ్య నాయకులతో నమోదు కేంద్రాన్ని సర్పంచ్ కటిక కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సందర్శించారు నూతనంగా చేర్పించే పట్టబదులు వీలైనంత త్వరగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లవరం గ్రామ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఎర్రి కృష్ణ రావు మల్లవరం గ్రామ పార్టీ అధ్యక్షులు సీతారామయ్య . తల్లాడ మండలం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రవీంద్ర. తల్లాడ మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్య అంజయ్య . కటిక ప్రసాద్. మేడి బలరాం. పట్టభద్రులు, పాల్గొన్నారు.