వర్షం.. పంటలకు ప్రాణం

17-09-2026 | 04:18pm

వాంకిడి,(విజయక్రాంతి): రెండు వారాలుగా వర్షాలు ముఖం చాటేయడంతో మండల రైతులు ఆందోళన చెందారు. గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వాంకిడి మండలంలో అత్యధికంగా సుమారు 34 వేల ఎకరాల్లో పత్తి పంట,5 వేల ఎకరాల్లో కంది, సోయా పెసర, మినుములు వంటి తదితర పంటలను సాగు చేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షం పంటలకు ప్రాణం పోసినట్ లైంది. మరో రెండు రోజులూ వర్షాలు వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.

మరిన్ని వార్తలు