సాయుధ పోరాట చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

17-09-2026 | 04:43pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం(CPI District Office) బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద జాతీయ జెండాను సిపిఐ జెండాను సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందని ప్రజలందరికీ తెలుసు కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం సిద్ధించిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు.

హైదారాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తూ ఇక్కడి ప్రజలచేత వెట్టి చాకిరి చేపిస్తూ, బానిసలుగా చూస్తూ,  ఎదిరించిన వారి ప్రాణాలను తీస్తున్న నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతలు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముక్దుo మొహియుద్దీన్ లాంటి నేతలు  1947 సెప్టెంబరు 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన పిలుపునిచ్చరని ఆ పిలుపునందుకొని గ్రామ గ్రామాన సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రజలు చైతన్య వంతులై నిజాం నవాబు, రజాకార్ పోలీసులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని, ఆ మహత్తర పోరాటం మూలంగా 3 వేల గ్రామాలు విముకై 4వేల 5వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘన చరిత్ర సిపిఐ కే దక్కిందన్నారు.

ఉద్యమాలకు పురుడుపోసిన కరీంనగర్ గడ్డపై పుట్టిన బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వ్యక్తుల్లో ఒకరని,ఆ పోరాటానికి దళానికి నాయకత్వం వహించింది తెలంగాణ భగత్ సింగ్ గా పేరొందిన వ్యక్తి అనభేరి ప్రభాకర్ రావు అని, రజాకార్ పోలీసుల తూటాలకు బలై ఎన్కౌంటర్ లో అసువులు బాసిన అనభేరి ప్రభాకర్ రావు ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, అలాంటి వీరుల త్యాగాలను,చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తున్న వారిని, సంస్థలను సిపిఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తూ, చరిత్రను కాపాడుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మహత్తర పోరాట ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు