తాండూరులో పొలంబడి కార్యక్రమం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామం(Tandoori village)లో పొలం బడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రేవంత్ నాథన్, కృష్ణ చైతన్య పాల్గొని రైతులకు సమగ్ర సస్య రక్షణ చర్యల యాజమాన్యం (ఐపిఎం), సమగ్ర పోషక యాజమాన్యం (Comprehensive nutritional management) గురించి రైతులకు వివరించడం జరిగింది. ఐపిఎం గురించి వివరిస్తూ రైతులు పంటలో పురుగు యొక్క ఉదృతి అనేది ఎక్కువగా ఉంటేనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఈటిఎల్ దాటని సమయంలో సస్య రక్షణ చర్యలు తీసుకొని రైతులు నష్ట పోకూడదని తెలియచేయ చేయడం జరిగింది.
ఈ ఈటియల్ని పొలంలో ఎకరాకు 6 నుండి 8 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి అందులో పడిన రెక్కల పురుగు సంఖ్యను బట్టి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు చెప్పారు.రసాయనాల వాడకం తగ్గించి,సహజ పద్ధతిలో రైతులు నీమాస్త్రం, ఆగ్నేయాస్త్రం,బ్రహ్మాస్త్రం వంటి ద్రావణాలను తయారుచేసుకుని వాడుకోవాలని సూచించడం జరిగింది. ఐఎన్ఎం గురించి వివరిస్తూ రైతులు జీలుగ, జనము,పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసి నేలలో కలియ దున్నడం వలన ఎకరాకు 10 నుండి 12 కేజీల వరకు నత్రజని ఆదా చేయవచ్చని తద్వారా ఎకరాకు వాడు యూరియా బస్తాలు మూడు నుంచి రెండు బస్తాలకు తగ్గించవచ్చని రైతులకు చెప్పడం జరింగింది.
అదేవిధంగా పంట అవశేషాలు కాలబెట్టకుండా నేలలో కూలియబెట్టడం ద్వారా నేల యొక్క సారం పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పడం జరిగింది.సేంద్రీయ ఎరువులు అయిన పశువుల ఎరువు,వర్మీ కంపోస్ట్,వేపపిండి,మొదలగునవి నేలలో వేయడం వలన నేలసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పడం జరిగింది.పొలం బడి కార్యక్రమంలో బాగంగా రైతులకు ఒక బ్యాగ్,పెన్స్, నోట్ బుక్ ఇవ్వడం జరిగింది.