వృద్ధులను ఒంటరితనానికి గురి చేయొద్దు
ఇల్లెందు,(విజయక్రాంతి): వృద్ధులను ఒంటరితనానికి గురిచేయకుండా కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని ఇల్లందు వాకర్స్ క్లబ్(Illendu Walkers Club) అధ్యక్షుడు దంతాల ఆనంద్ సూచించారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని(International Day of Older Persons) పురస్కరించుకుని గురువారం సింగరేణి జేకే గ్రౌండ్లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంతాల ఆనంద్ మాట్లాడుతూ.. వృద్ధాప్యం శాపం కాదని, జీవిత అనుభవాల పండుగ అని పేర్కొన్నారు.
వృద్ధులు(Elderly) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒంటరితనం, కుటుంబ సభ్యుల నిరాదరణేనన్నారు. వారిని గౌరవిస్తూ సమయం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చిన్ననాటి నుంచే పిల్లలకు వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను నేర్పించాలని సూచించారు. వృద్ధుల అనుభవాలను కుటుంబానికి మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు విశ్వనాథం, అప్పలరాజు, యాదగిరి, సుదర్శన్ కోరి, మనోహర్, నాగేశ్వరరావు, హరి, అయిత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.