ఖమ్మం ఎంపీ సీతారామ టన్నెల్ పరిశీలన

17-10-2026 | 05:29pm

బురదలో నడుస్తూ పురోగతిని పరిశీలించిన రఘురాం రెడ్డి

సత్తుపల్లి, ఖమ్మం, అక్టోబర్ 17(విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) పనుల పురోగతిని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి(Khammam MP Ramasahayam Raghuram Reddy) శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్తుపల్లి మండలం(Sattupalli Mandal) యతాలకుంట గ్రామం వద్ద ప్రాజెక్టు టన్నెల్‌(Project Tunnel) ప్రాంతానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి వెళ్లారు.

బురదలో నడుస్తూ టన్నెల్‌ ప్రాంతానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు, పనులకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు. 

ఈ కార్యక్రమంలో..: అదనపు కలెక్టర్‌ , జిల్లా అటవీశాఖ అధికారి, కల్లూరు సబ్‌ కలెక్టర్‌,  సర్పంచులు, కౌన్సిలర్లు,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు