వృద్ధురాలికి ఆర్థిక భరోసా

13-11-2026 | 10:49pm

ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి): జీవనం కొనసాగించుటకు సతమతమవుతున్న ఒక వృద్ధురాలికి సంవిధాన్ ప్రజాసమితి ఆర్థిక భరోసా(Financial Assurance by the Samvidhan Praja Samiti) కల్పించి అండగా నిలిచింది. గత 40 సంవత్సరాలుగా కరీంనగర్(Karimnagar) లోని ఒకే ఇంట్లో ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తున్న గసికంటి అనంతమ్మ(Gasikanti Ananthamma) కు కరీంనగర్ గాంధీ రోడ్ లోని సంవిధాన్ ప్రజా సేవా సమితి వారు అనంతమ్మ పడుతున్న శ్రమను గుర్తించి ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని అనంతరాములు అండ్ సన్స్ వారిని సంప్రదించి ఆమెకు గౌరవ ప్రదమైన జీవనం గడుపుటకు ప్రతి నెల రూ. 1000/- అందించాలని కోరగా ఇంటి యజమాని మానవతా దృక్పథంతో ఆలోచించి తన సమ్మతిని తెలియజేశారు.

ఇంటి యజమాని వెంటనే స్పందించినందుకు సంవిధాన ప్రజా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం. కుమార్, ఉపాధ్యక్షులు వి. సుమన్, ప్రధాన కార్యదర్శి కె. రమేష్ మరియు కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు