కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలి

12-10-2026 | 09:44pm

సర్ పై బురదజల్లే ప్రయత్నం కొనసాగుతుంది

రాపాక ప్రవీణ్ కేంద్ర ఫిలిం బోర్డు సభ్యులు రాపాక ప్రవీణ్

మానకొండూరు,(విజయక్రాంతి): సర్(Special Intensive Revision Process)పై కొన్ని పార్టీలు అంతర్గత కుట్రలతో, బురదజల్లే ప్రయత్నం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర ఫిలిం బోర్డు సభ్యులు(Central Film Board Members), లక్ష్మీపూర్ గ్రామ ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు.దేశ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, ఆప్,  కాక్రోచ్ పార్టీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. నరేంద్ర మోడీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాహుల్ గాంధీ  ఓటు చోరి అనే అబద్ధపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం మండల కేంద్రమైన మానకొండూరు(Manakondur)లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడారు. దేశంలో 95 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే 82 కోట్ల మంది ఓటర్లుగా 88 శాతం మంది  నమోదు అయ్యారని చెప్పారు. ఇంకా నమోదు చేసుకునే అవకాశం  ఉందని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గతంలో ఈ దేశంలో 8 సార్లు నిర్వహించారని,అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 07 సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని గుర్తు చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ ను ప్రతిపక్ష నాయకులు సచిన్ పైలెట్, శశిధరూర్, తదితర అగ్ర నేతలు  ఎస్ఐఆర్  వల్లనే బోగస్ ఓట్లు తొలగిపోయాయని కొనియాడారని గుర్తు చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటప్పుడు పోలింగ్ బూత్ లలో  దరఖాస్తు ఫారం లో నింపుతూ ప్రతి వారంలో సమావేశానికి హాజరైనారని ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు తీసివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు . ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను ప్రజలందరూ గమనిస్తున్నారని దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ,బిజెపి ప్రభుత్వమే వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల శంకరాచారి, జిల్లాల రాజమౌళి, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మియాపూరం లక్ష్మణ చారి, మండల ప్రధాన కార్యదర్శులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, శీలం కుమార్, పోచంపల్లి సర్పంచ్ అంబటి స్వామి, దేవంపల్లి ఉప సర్పంచ్ దాడి కార్తీక్,మాజీ మండల ప్రధాన కార్యదర్శిలు వంగళ ఆంజనేయులు, కత్తి ప్రభాకర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్, మర్రి ఆంజనేయులు, సీనియర్ నాయకులు గాడిచెర్ల భూమయ్య, మార్కొండ రమేష్ పటేల్ ,మాచర్ల కోటేశ్వర్, మండల కార్యదర్శులు నందగిరి బలరాం, ఆరేపల్లి సునంద్ కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అడప రవి, బీజేవైఎం జిల్లా నాయకులు తాడూరి కిరణ్ రెడ్డి, మడ్డీ రాకేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు  కొండ్ర వరప్రసాద్, కాల్వ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు