అక్రమ రిజిస్ట్రేషన్
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకదారుల సంఘ(Sri Mallikarjuna Sheep Breeders Association) భూమి 4 ఎకరాల 04 గుంటలు (సర్వే నెం. 582/F) ను ఉస్మానియా ఆగ్రో ఇండస్ట్రీస్(Osmania Agro Industries) వారు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్(Illegal registration) చేసుకున్నారని సంఘ సభ్యులు తెలిపారు. సంఘంలో 60 మంది సభ్యులు ఉన్నారని, ఈ భూమిని 08/06/2005న డాక్యుమెంట్ నెం. 5556/2005 ద్వారా తమ సంఘం పేరున రిజిస్ట్రేషన్ చేయించామని, అయితే తమకు తెలియకుండా 02/01/2007న డాక్యుమెంట్ నెం. 11/2007 గా ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేసిందని ఆరోపించారు. నిలదీస్తే బెదిరిస్తున్నారని, 2007 నుండి నేటి వరకు, పోరాడుతున్నామని, అధికారులు విచారణ జరిపి తమ భూమిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.