తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

17-09-2026 | 05:33pm

బిజేపి నాయకులు అమరం మోహన్ రెడ్డి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగిందని రూరల్ మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి(Medchal District BJP General Secretary Amaram Mohan Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఎంఐఎం పార్టీకి భయపడుతుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముందిరాజ్, ప్రధాన కార్యదర్శి రామారావు, నవీన్, ప్రదీప్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు