సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా..
రైస్ మిల్లుల కార్మికుల ఉపాధిని కాపాడాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్
సుల్తానాబాద్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): గత 9 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న రైస్ మిల్లు యజమాను సమ్మెను విరమింప చేసి, రైస్ మిల్లు కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ శాస్త్రి నగర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించి, తాసిల్దార్ బషీరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ రైస్ మిల్లు ఓనర్స్ అసోసియేషన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి, సమ్మెనునివారించి,పరిశ్రమను నడిపించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది, పెద్దపల్లి జిల్లాలో 8వేల మంది కుటుంబాలు రైస్ మిల్లు పరిశ్రమపై ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు, గుమస్తాలు, ఆపరేటర్స్, మహిళా కూలీలు, లారీ డ్రైవర్స్, హమాలీలు తదితర కేటగిరీలుగా పనిచేస్తున్నారని అన్నారు.
రైస్ మిల్లు యజమానులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి, సమ్మెను విరమింప చేసి, పరిశ్రమను నడిపించే విధంగా తగు చర్యలు తీసుకోని రైస్ మిల్లు కార్మికుల ఉపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, సిఐటియు మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌవుండ్ల బ్రహ్మచారి, వీరగోనీ కిరణ్ గౌడ్ కార్మికులు, సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.