ముదిగొండలో అభివృద్ధికి శంకుస్థాపన..
17-09-2026 | 05:29pm
ముదిగొండ, (విజయక్రాంతి): మండల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. చిరుమర్రి చెరువు వద్ద రూ.2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) శంకుస్థాపన చేశారు. మండల కేంద్రం అయిన ముదిగొండలో రాష్ట్ర గిద్దంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరావు కృషితో రూ.40 లక్షలతో నూతన గ్రంథాలయ భవనం శంకుస్థాపన, వనం వారి కృష్ణాపురంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ పనులతో పర్యాటక, విద్యా, మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.