గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ చిత్రా మిశ్రా

02-10-2026 | 08:47pm

ముకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): శాంతి, అహింస మార్గాలను ఆయుధాలుగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం ముందు భాగంలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం.. ఆయన చూపిన బాటలో అందరం నడుద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, నగర పాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు