ప్రతి ఒక్కరికి గంట పాటు శారీరక వ్యాయామం అవసరం

04-10-2026 | 04:14pm
  1. జిల్లా సహా సంఘ చాలక్ కొమీ రెడ్డి స్వామి
  2. స్వప్నలోక్ లో ఘనంగా శాఖా సప్తాహం

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం(Physical exercise) గంట పాటు అవసరమని జిల్లా సహా సంఘ చాలక్ కొమీరెడ్డి స్వామి(District Sanghchalak Komireddy Swami) అన్నారు. ఆదివారం కామారెడ్డి స్వప్నలోక్ కాలనీలో(Kamareddy Swapnalok Colony)  సంఘ శతాబ్దిలో భాగంగా  శాఖా సప్తాహం చివరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహా సంఘ చాలక్ కొమిరెడ్డి స్వామి మాట్లాడుతూ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 4 వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 గంటల వరకు శాఖ సంఘ చాలక్  నిర్వహించామన్నారు.

ఈ యాంత్రిక జీవనంలో ప్రతీ ఒక్కరికి ఒక గంట శాఖ ఖచ్చితంగా అవసరమని దీని వలన శారీరకంగా, మానసికంగా దృడంగా తయారవుతారని అన్నారు.  ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం శాఖ నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ సప్తాహం చివరి రోజైన ఉపస్థితి దిన్ లో తరుణ 25, బాల 41, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు