రాఘవేంద్రరావు పంచ్.. ఎన్టీఆర్ రియాక్షన్ వైరల్! (వీడియో)
టాలీవుడ్‌లో(Tollywood) ఏ కార్యక్రమం జరిగినా స్టార్ హీరోల మాటలు, దర్శకుల కామెంట్లు అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంటాయి. తాజాగా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’(Dont Trouble The Trouble) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(Raghavendra Rao) చేసిన వ్యాఖ్యలకు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR Reaction) ఇచ్చిన రియాక్షన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌కు శశాంక్ వెన్నెలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు తన ప్రసంగాన్ని ‘జై ఎన్టీఆర్’ అంటూ ప్రారంభించారు. అయితే వెంటనే ఆయన మాటల్లో సరదా ట్విస్ట్ ఇచ్చారు. తాను చెబుతున్నది వేదికపై ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి కాదని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి అని స్పష్టం చేశారు.
ఆ తర్వాత నందమూరి కుటుంబంలోని తరాల గురించి ప్రస్తావిస్తూ రాఘవేంద్రరావు చమత్కరించారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ, ఆయన కుమారుడిగా వేదికపై ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావించి, ‘జెన్‌జీ ఎన్టీఆర్’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. రాఘవేంద్రరావు వ్యాఖ్యలు(Raghavendra Rao Comments) సాగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చిరునవ్వుతో స్పందిస్తూ కనిపించారు. పక్కనే ఉన్న ఎస్ఎస్ రాజమౌళి కూడా నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన సమయంలో తారక్ చూపించిన గౌరవం, ప్రశాంతమైన స్పందన సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం Jr NTR Reaction Viral Video, Raghavendra Rao Comments అంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విషయానికి వస్తే.. ఫహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.
వీరిద్దరి బాండింగ్ ❤️❤️
— తార-సితార (@Tarasitaranews) September 29, 2026
ఒక గొప్ప నటుడు.. ఒక గొప్ప దర్శకుడు 😍😍..
కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న వారి క్రేజ్ ఒక రోజుతో వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ల కష్టం వీరి కల్మషం లేని నవ్వుకి నిదర్శనం.. #Rajamouli #JrNTR pic.twitter.com/H19iTyuuLN