సీసీ కెమెరాలపై అవగాహన

02-10-2026 | 06:07pm

వెంకటాపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశావతి(Village Sarpanch Bommakanti Vamsavathi) అధ్యక్షతన, స్థానిక ఎస్‌ఐ చల్లా రాజు(SI Challa Raju) పర్యవేక్షణలో సీసీ కెమెరాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు డీఎస్పీ రవీందర్, ములుగు సీఐ సురేష్ హాజరై సీసీ కెమెరాల ప్రాధాన్యత, గ్రామంలో నేరాల నియంత్రణకు వాటి ఉపయోగం గురించి ప్రజలకు వివరించారు.

గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు