పార్టీలో అంతా బీఆర్ఎస్ గ్రూపే!

28-10-2026 | 03:39pm

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పార్టీలో పల్లా గ్రూపు(Palla Group), రాజేందర్ గ్రూపు(Rajender Group) అంటూ లేవని, అందరిదీ కేసీఆర్ గ్రూపే(KCR's group), బీఆర్ఎస్ గ్రూపేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) ఆధ్వర్యంలో బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని అన్నారు. దరఖాస్తుల సమర్పణతో సరిపెట్టుకోవద్దని, ఆమోదం పొందే వరకు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి గ్రామానికి కోఆర్డినేటర్లను నియమించి బాధ్యతలు అప్పగించాలని, గ్రామాలవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కీలకమన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు