మల్యాల మండలంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

30-09-2026 | 05:37pm

మల్యాల ,సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ):మల్యాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో మల్యాల మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, నాయకులు తాటిపాముల రాజేందర్, మిట్టపల్లి దశరథం, చిన్న దుర్గయ్య, అరుణ్,ముణుగూరు రంజిత్, సంజీవ్, చందు, నరసయ్య, సంఘ సత్యనారాయణ, గడ్డం రాజేశం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు