కరీంనగర్ త్రీ టౌన్ టాస్క్‌ఫోర్స్ జాయింట్ ఆపరేషన్

18-09-2026 | 11:24am

 సుమారు 2 కిలోల గంజాయి స్వాధీనం

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Task Force Police) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీ, వరాహస్వామి ఆలయం(Varahaswamy Temple) సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సయ్యద్ ముబీన్ (34), మొహమ్మద్ యూనస్ (29)లను  పోలీసులు పట్టుకున్నారు, వారి వద్ద ఉన్న సుమారు 2 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు గంజాయిని నాగ్‌పూర్ నుండి కొనుగోలు చేసి కరీంనగర్‌కు తీసుకువచ్చినట్లు, తమ అవసరాల కోసం వినియోగించడంతో పాటు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సంయుక్త ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇన్‌స్పెక్టర్   తిరుమల్, ఎస్ఐ లు సురేందర్, చేరాలు, శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాల్, లింగమూర్తి, కానిస్టేబుళ్లు రాజయ్య, రాజు, శ్రీనివాస్,సాయి నేత్ర,  నరేష్, ప్రశాంత్,  రాజు హోమ్ గార్డ్ శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం  అభినందించారు.

మరిన్ని వార్తలు