చేపల వేటకు వెళ్లి విషాదాంతం

25-10-2026 | 09:12am

నేలపట్ల గ్రామంలో సంఘటన

కూసుమంచి, అక్టోబర్ 25(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో(Nelapatla Village) చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. నేలపట్ల గ్రామానికి చెందిన చెన్నబోయిన రాజేష్(34)అనే వ్యక్తి గ్రామ సమీపంలోని చెరువులోకి రాత్రి చేపల వేటకు వెళ్లారు.వేటకు వెళ్లిన వ్యక్తి ఎంతకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెతక సాగారు. చెరువు గట్టున ఉన్న చెప్పుల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో విగత జీవిగా మారిన రాజేష్ మృతదేహం తెల్లవారుజామున  లభించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు