చింతకాయల గొడవ.. వ్యక్తిపై దాడి
02-11-2026 | 11:30am
కన్నాయిగూడెం, నవంబర్ 02(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu district) కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో చింతకాయల విషయంలో జరిగిన గొడవలో అలం కిషోర్ (45)పై దాడి జరిగినట్లు సమాచారం. గట్టు మీద చింతచెట్టు కాయల విషయంలో మరో వ్యక్తితో వాగ్వాదం చోటుచేసుకోగా, సదరు వ్యక్తి ఇనుము రాడ్డుతో కిషోర్‌పై దాడి చేసినట్లు తెలిసింది. ఘటనలో గాయపడిన కిషోర్‌ను ఈఎంటీ మహేశ్వరి, పైలట్ సతీష్ సహాయంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.