ఎరిస్ టాటా ప్యాసింజర్ కారు ఆవిష్కరణ

10-10-2026 | 05:15am

శ్రీవెంకటేశ్వర టాటా మోటార్స్ షోరూమ్‌లో కార్యక్రమం

నిజామాబాద్, అక్టోబర్ ౯(విజయక్రాంతి): దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు, కొనుగోలుదారులకు ఒక శుభవార్త. ఎరిస్ అనే నూతన టాటా ప్యాసింజర్ కార్(Tata Passenger Car) ఆవిష్కరణ శుక్రవారం శ్రీ వెంకటేశ్వర టాటా మోటార్స్ బూర్గం హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ షోరూంలో టాటా మోటార్స్ ఎండీ జయ, ఎస్‌బీఐ ఏజీఎం వరప్రసాద్, ఇతర బ్యాంక్ సిబ్బంది, ముఖ్య అతిధుల సమక్షంలో జరిగింది.

సేఫ్టీ, మంచి లుక్కు, యావరేజ్ ఇస్తూ టాటా కార్లు మంచి మన్నికతో పేరుగాంచినవి. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ఎంతోమంది వినియోగదారులు టాటా ప్యాసింజర్ కారులను మాత్రమే కొనడానికి మొగ్గు చూపుతున్నారు.కావున శ్రీ వేంకటేశ్వర మోటార్స్ ఎన్నో కార్లను ముందస్తుగా అందుబాటులో వినియోగదారుల సౌకర్యార్థమై ఏర్పాటు చేసినట్లు షోరూమ్ ప్రతినిధులు పేర్కొన్నారు . పండుగలను పురస్కరించుకొని ఎన్నో రకాల ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు టాటా ప్యాసింజర్ కార్స్ ఏర్పాటు చేసింది అన్నారు.

మరిన్ని వార్తలు