జింకలగూడెంలో పోలీసుల కార్డెన్ సెర్చ్
- పత్రాలు లేని 40 వాహనాలు సీజ్
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Police cordon and search operation) నిర్వహించారు. ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు.గంజాయి సేవనం, అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు.
చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను నమ్మి ఎవరినీ హింసించవద్దన్నారు. వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు వెంట ఉంచుకోవడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగ భిక్షం,రామ్మూర్తి,పాల్వంచ టౌన్ ఎస్ఐ లు నాగరాజు, విజయ, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్, మరియు డాగ్స్ స్క్వాడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.