అసాంఘిక కార్యక్రమాలపై పోలీసుల ఉక్కుపాదం

02-10-2026 | 12:00pm

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి 

పాల్వంచ,(విజయక్రాంతి): అసాంఘిక కార్యక్రమాల(Anti-social activities)పై పోలీసు ఒక్క పాదం మోపింది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణములు కొంతకాలంగా విచ్చలవిడిగా కొనసాగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు దృష్టి సారించారు. పాల్వంచ(Palvancha) దమ్మపేట సెంటర్ త్రివేణి స్కూల్ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం(Adultery) జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పట్టణ ఎస్సై టీ నాగరాజు ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు.

దాడిలో ఇద్దరు ఆర్గనైజర్లు మేడిపల్లి సంధ్య అలియాస్ ప్రశాంతి, చిన్నపాటి బేబీ శ్యామల అలియాస్ అనూష వారి ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారితోపాటు నలుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని వారి  నుండి రెండు వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు